
పద్మారావునగర్, వెలుగు: అనారోగ్య సమస్యలతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకొని మృతి చెందాడు. మహాంకాళి ఇన్స్పెక్టర్ పరుశురామ్ వివరాల ప్రకారం.. 2014 బ్యాచ్‌కు చెందిన గాజుల రంగనాథ్‌రావు(36) హైదరాబాద్ ఐటీ సెల్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య దాక్షాయణి, 16 నెలల కొడుకు ఉండగా, అంతా కలిసి సికింద్రాబాద్ కళాసిగూడలో నివాసం ఉంటున్నారు.
రంగనాథ్ మూడేండ్లుగా పలు వ్యాధులతో బాధపడుతున్నాడు. రెండేండ్ల కిందట అతనికి సర్జరీ కాగా, ఇప్పటికీ మందులు వాడుతున్నాడు. ఈ నెల16న భార్య దాక్షాయణి పుట్టింటికి వెళ్లగా, అక్కడి నుంచి భర్తకు ఫోన్‌చేసింది. లిఫ్ట్చేయకపోవడంతో తిరిగి రాత్రి ఇంటికి వచ్చింది. అప్పటికే బెడ్రూంలోని రంగనాథ్ఉరేసుకొని మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.