మామిడికాయలు తీసుకుని పైసల్ ఇయ్యలే.. వీడియో తీస్తే ఫోన్ పే కొట్టిండు

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఓ   ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది.  2023 జూలై 09  ఆదివారం రోజున అంగడి కావడంతో రోడ్డుపై మామిడికాయలు అమ్ముకుంటున్న  ఓ చిరు వ్యాపారి దగ్గరికి వెళ్లి నాలుగు కిలోల మామిడికాయలు తీసుకున్నాడు  ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్. అయితే తీసుకున్న మామిడికాయలకు డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

అయితే ఈ తతంగాన్ని మొత్తం ఓ యవకుడు మొబైల్ లో  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  దీంతో వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్  మళ్లీ ఆ వ్యాపారి దగ్గరికి వెళ్లి రెండు వందల రూపాయలను  ఫోన్ పే కొట్టాడు. అనంతరం మీరు దేవుడు సారు అంటూ ఆ వ్యాపారితో చెప్పి్ంచుకున్నాడు.