రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి గుండెపోటు

  •     సీపీఆర్‌ చేసి కాపాడిన కానిస్టేబుల్

హసన్ పర్తి, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి గుండెపోటు గురైన ఓ వాహనదారునికి సీసీఎస్ క్రైమ్  కానిస్టేబుల్  వెంకన్న సీపీఆర్  చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగట్టుగుట్ట వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తికి ఫిట్స్  వచ్చాయి.

తర్వాత అతను గుండెపోటుకు గురయ్యాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న సీసీఎస్  క్రైమ్  కానిస్టేబుల్ వెంకన్న.. బాధితుడి వద్దకు వెళ్లి సీపీఆర్  చేసి బతికించాడు. అనంతరం ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు. దీంతో అందరూ ప్రశంసించారు.