దహెగాం, వెలుగు : స్కూల్లో టాయిలెట్ లేక టీచర్లు, స్టూడెంట్లు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఓ కానిస్టేబుల్ చలించారు. తన సొంత ఖర్చులతో టాయిలెట్‌ను కట్టించారు. దహెగాం మండలం దుబ్బగూడలోని ఎంపీపీఎస్‌లో టాయిలెట్ లేకపోవడంతో మహిళా టీచర్లు తాత్కాలిక టాయిలెట్‌ను ఏఈర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్ పంజాల నివాస్ గౌడ్గతంలో ఎస్సైగా పనిచేసిన పంజాల మొండయ్య జ్ఞాపకార్థంగా స్కూల్లో టాయిలెట్ నిర్మించారు.