ఇలాంటోళ్లను ఏమనాలి.. ఫస్ట్ నైట్ ఫొటోలు ఫేస్ బుక్లో పోస్ట్ చేశాడు..!

ఇలాంటోళ్లను ఏమనాలి.. ఫస్ట్ నైట్ ఫొటోలు ఫేస్ బుక్లో పోస్ట్ చేశాడు..!

ఛీ.. ఇదెక్కడి టార్చర్ రా బాబూ.. ఇలాగే ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తుంటే.. బెడ్ రూం వ్యవహారాలు సైతం లివింగ్ రూంలో డిస్కషన్స్అయిపోతున్నాయి. ఏది గుట్టుగా ఉండాలి.. ఏది జనానికి చెప్పాలి అనే సోయి కూడా లేకుండా ఏడ్చింది కొందరికి.. ఓ ప్రబుద్దుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసి.. నోరెళ్లబెట్టాల్సిందే. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకున్నాడు.. ఈ ఫొటోలు ఎంచక్కా.. తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచే పబ్లిక్ చేసేశాడు.

మన దేశంలో కొందరికి వైరల్ వైరస్ సోకింది. ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలనే తపన రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా కొందరు యువత తీరు నివ్వెరపోయేలా చేస్తుంది. శోభనం ఫొటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది. ఒక మహానుభావుడు ఫస్ట్ నైట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఫేస్ బుక్లో షేర్ చేశాడు. Rahul.Radha143 అనే పేరుతో ఉన్న తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫొటోలను ఎఫ్బీలో పోస్ట్ చేశాడు.

పైగా.. అదేదో పెద్ద ఘన కార్యం చేసినట్లు “Today is our Suhagraat" (ఇవాళ మా శోభనం రాత్రి) అని రాసుకొచ్చి #Photography అని అవేవో పెళ్లి ఫొటోలు.. బర్త్ డే ఫొటోల రీతిలో షేర్ చేశాడు. తన భార్యను కౌగిలించుకుని, ఆమె ఇతగాడికి ముద్దులు పెడుతూ.. అబ్బో.. ఆ దృశ్యాలు చూసి నెటిజన్లు మనోడికి గట్టిగానే గడ్డి పెడుతున్నారు. 38 వేల వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ అయితే దాదాపు అన్నీ వెటకారంగానే ఉన్నాయి. వీడియో సెండ్ చేయమని ఒకరు, వీడియో కూడా పోస్ట్ చేయమని మరొకరు.. ఇలా ఎవరికి తోచిన కామెంట్ వాళ్లు చేసి ఈ ప్రబుద్ధుడిని ఆడుకున్నారు.

సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైంది. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ.. సోషల్ మీడియా నెగెటివ్ యాంగిల్ను కూడా పరిశీలించాలి.ఆరోగ్యవంతంగా ఉండాల్సిన మానవ సంబంధాలు సోషల్ మీడియా పుణ్యమా అని విచ్ఛిన్నమవుతున్నాయి. సైబర్ బెదిరింపులు, ఆన్ లైన్ వేధింపులు, ట్రోలింగ్ సమస్యలు పెరిగాయి. యువతలో  సగం మంది సోషల్ మీడియాకు తీవ్రంగా అడిక్ట్ అయ్యారు. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత అంశాలకు సంబంధించిన గోప్యత విషయంలో హద్దులు దాటుతున్నారు. గుట్టుగా ఉండాల్సిన విషయం కూడా ఇంటి గడప దాటుతోంది. 

సోషల్ మీడియాలో చేరి ఊరంతా చేరుతుంది. పరిచయం లేని వ్యక్తులు ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరకావడానికి  ప్రయత్నించడం చివరకు ఈ బాపతు కహానీలు విషాదాంతంగా ముగియడం ప్రతిరోజూ  అందరం చూస్తున్నదే. సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ ఫాం అయినా అది మనం ఎదగడానికే ఉపయోగపడాలి కానీ దిగజారడానికి కాదు. సోషల్ మీడియా పిచ్చిలో పడి మానవ సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.