- అరుణాచల్ ప్రత్యేక కోర్టు తీర్పు
గువాహటి: ఇరవై ఒక్క మంది స్టూడెంట్లపై అత్యాచారానికి, వేధింపులకు పాల్పడ్డ ఓ హాస్టల్ వార్డెన్‌కు కోర్టు మరణ శిక్ష విధించింది. ఇందుకు సహకరించిన హెడ్మాస్టర్కు, విషయం తెలిసినప్పటికీ కావాలనే పైఅధికారుల దృష్టికి తీసుకురాని ఓ మహిళా టీచర్‌కు 20 ఏండ్ల జైలు శిక్ష వేసింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని షి యోమి జిల్లా ప్రభుత్వ రెసిడెన్సియల్ స్కూల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న యుంకెన్ బాగ్రా.. 2014 నుంచి 2022 వరకు 21 మంది స్టూడెంట్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఏడుగురు అబ్బాయిలు కూడా ఉన్నారు. తమ ఇద్దరు కూతుళ్ల(కవలలు)పై వార్డెన్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పేరెంట్స్ 2022 నవంబర్‌లో మోనిగాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.