బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని బిర్యానీ వాలా హోటల్లో గురువారం ఓ కస్టమర్‌కు ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. ఆర్డర్ చేసి తింటున్న బిర్యానీలో బొద్దింక రావడంతో యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. వారు నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే, జీహెచ్ఎంపీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వచ్చి తనిఖీలు నిర్వహించారు. హోటల్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.