- గగన్ పహాడ్ వద్ద ఘటన కాలిపోయిన సామగ్రి
శంషాబాద్, వెలుగు: కుర్చీల లోడ్‌తో వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. హయత్‌నగర్‌కు చెందిన శ్రీను డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం గగన్ పహాడ్ దగ్గరున్న ఓ ఫర్నిచర్ కంపెనీ నుంచి ప్లాస్టిక్ కుర్చీల లోడ్ తీసుకుని డీసీఎంతో చెన్నైకి బయలుదేరాడు. బెంగళూరు నేషనల్ హైవే మీదుగా వెళ్తుండగా మెట్రో మార్ట్ వద్ద డీసీఎం క్యాబిన్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విషయాన్ని గమనించిన శ్రీను వెంటనే రోడ్డు పక్కన డీసీఎంను ఆపి దిగిపోయాడు. స్థానికుల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నించాడు. మంటలు తీవ్రత ఎక్కువై ప్లాస్టిక్ కుర్చీలతో పాటు డీసీఎం పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బెంగళూరు నేషనల్ హైవేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కాగా.. ఎయిర్‌పోర్టు పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపారు.