శంషాబాద్ ఔటర్ రింగ్ పై డీసీఎం వాహనం బీభత్సం

శంషాబాద్ ఔటర్ రింగ్ పై డీసీఎం వాహనం బీభత్సం

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఔటర్ రింగ్ పై ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కిషన్ గూడా వద్ద ఉన్న టోల్ బూతులోకి అతివేగంగా డీసీఎం వాహనం దూసుకొచ్చింది. దీంతో టోల్ బూత్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ సమయంలో టోల్ బూత్ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. శంషాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వెళ్తున్న సమయంలో డీసీఎం అదుపుతప్పి.. టోల్ బూత్ లోకి దూసుకెళ్లిందని చెబుతున్నారు. డీసీఎం టోల్ బూత్ లోకి దూసుకొచ్చిన సమయంలో దాంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం విషయం గురించి టోల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే.. ఇలాంటి ఘటనలపై తాము కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారని టోల్ సిబ్బంది ద్వారా తెలుస్తోంది.