విమానం టైరులో డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే..?

విమానం టైరులో డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే..?

వాషింగ్టన్: విమానం టైరులో వ్యక్తి డెడ్ బాడీ కనిపించడం కలకలం రేపింది. హవాయి ద్వీపమైన మౌయిలోని కహులుయీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్లేన్ టైరులో అధికారులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. బోయింగ్ 787--10 విమానం అమెరికా షికాగోలోని ఓహే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మంగళవారం ఉదయం 9:31 గంటలకు బయలుదేరింది. మధ్యాహ్నం 2:12 గంటలకు కహులుయీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. 

ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విమానం వీల్-వెల్‎లో  ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. డెడ్ బాడీని వెంటనే బయటకు తీసి అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వీల్-వెల్‎లోకి  ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.