నల్లమల్ల అడవిలో చిరుత అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి నల్లమల అడవిలో చిరుతపులి మృతిదేహం గుర్తించారు స్థానికులు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పులి మృతదేహాం ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించారు. చిరుత పులిపై విష ప్రయోగం చేయబడిందా.. లేక వేటాడి చంపారా అన్న కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :- ఉప్పు ఎక్కువైతే బీపీతోపాటు వచ్చే వ్యాధులు ఏంటీ
మరో చోట ముళ్లపంది చంపి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల శివారులో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. వన్యప్రాణిని వదించి వాహనంలో తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.