యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా హాస్పిటల్‌లోని ఓ వ్యక్తి డెడ్‌బాడీని ఎలుకలు కొరికాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పెంకుల రవి భువనగిరిలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కానీ, రవి మృతదేహాన్ని సిబ్బంది మార్చురీ ఫ్రీజర్‌లో కాకుండా బయటే ఉంచగా.. ఎలుకలు దాడి చేసి ముఖాన్ని కొరికేశాయి. దీనిపై బంధువులు హాస్పిటల్ స్టాఫ్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్ జనగాం కవిత నర్సింహచారి సాయంతో రవి అంత్యక్రియలు నిర్వహించారు.