2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

2వేల నోట్ల ప్రింటింగ్ ఆపేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలే: కేంద్రం

న్యూఢిల్లీ: రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం లోక్​సభలో వెల్లడించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రిటెన్ రిప్లై ఇచ్చారు. ఏ నోట్లు ఎన్ని ప్రింట్ చేయాలనే దానిపై ఆర్బీఐని సంప్రదించి కేంద్రం డెసిషన్ తీసుకుంటుందన్నారు. అయితే 2019–20, 20–21 ఫైనాన్షియల్ ఇయర్​లో 2వేల నోట్ల ప్రింటింగ్​కు ఇండెంట్ పెట్టలేదన్నారు. 2019 మార్చి 31 వరకు 32,910 లక్షల 2వేల నోట్లు సర్క్యులేషన్ లో ఉండగా.. 2020 మార్చి 31 వరకు 27,398 లక్షల నోట్లు ఉన్నాయన్నారు.

For More News..

పాలకమండళ్లు లేని ప్రఖ్యాత దేవాలయాలు

రెండేళ్లు గడిచినా ‘కంటి వెలుగు’ల్లేవ్‍.. స్టోర్‍ రూముల్లోనే అద్దాలు..

అగ్రి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి.. ఎంపీలకు కేసీఆర్ ఆదేశం