నారసింహుడికి వెండి పల్లెం, మాణిక్యాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టకు చెందిన భక్తుడు, మాజీ వార్డు సభ్యుడు గౌలీకార్ శ్యామ్ లాల్ 522 గ్రాముల వెండితో తయారు చేయించిన  హారతి పల్లెం, మాణిక్యాలను లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సమర్పించారు.  మంగళవారం  ఆలయ ఏఈవో గజవెల్లి రఘు చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు.   హారతి పూజల్లో ఈ వెండి పల్లెం, మాణిక్యాలను వినియోగించనున్నట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. అనంతరం దాత గౌలీకార్ శ్యామ్ లాల్ ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.