భక్తుడికి గుండెపోటు..సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

భక్తుడికి గుండెపోటు..సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

పెద్దపల్లి జిల్లా  ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తుడికి గుండెపోటు వచ్చింది.  వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న సమయంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా  కింద పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న పొత్కపల్లి ఎస్ఐ రమేష్  భక్తుడికి సీపీఆర్ చేసి  ప్రాణాలు కాపాడాడు. 

భక్తుడిని వెంటనే  ఎస్సై వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  భక్తుడిని పరీక్షించి అతడి  ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు డాక్టర్లు.   ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై రమేష్ ను అభినందించారు తోటి భక్తులు.