గుడిలో దేవున్ని పూజించి విగ్రహాన్నే దొంగలించాడు ఓ భక్తుడు. దీనికి సంబంధించి దేవాలయంలోని సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో వైరల్ అవుతుంది. గుడిలోని దేవుడికి మొక్కి విగ్రహాన్ని చోరీ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అబ్దుల్లాపూర్ లోని ఓ శివాలయంలో మార్చి 12న ఈ ఘటన జరిగింది. గుడిలోకి వచ్చిన వ్యక్తి ఫస్ట్ దేవుడి విగ్రహానికి దండం పెట్టి పూజించాడు. బయట ఎవరైనా తనను చూస్తున్నారేమో అని చుట్టూ గమనించాడు.
Meerut,Uttar Pradesh: A thief absconded with the idol of the "Naag Devta" after a brief visit to the temple. pic.twitter.com/CBAlVtvdx5
— Mohd Shadab Khan (@Shadab_VAHIndia) March 12, 2024
తర్వాత దేవుడి విగ్రహాన్ని సంచిలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓ దొంగ భక్తి ప్రదర్శిస్తూ చోరి చేశాడు. ఇదంతా గుడిలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ దొంగ శివలింగంపైన ఉండే రాగి నాగదేవత విగ్రహం ఎత్తుకెళ్లాడు. విషయం బయట పడిన తర్వాత రోజు పోలీసులు కేసు నమోదు చేశారు.