వరంగల్సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం ధర్నా నిర్వహించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది ఇందులో పాల్గొన్నారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ ధర్నాలో కాంట్రాక్టర్కు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లేబర్ చట్టం ప్రకారం రూ. 15600 వేతనం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ. 11000 మాత్రమే ఇస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ జాడ లేదన్నారు. మా జీతాలను కాంట్రాక్టర్ జేబులో వేసుకుంటూ కోట్లు దోచుకుంటున్నారని కార్మికులు విమర్శించారు. 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించలేదని, అందుకే అరగంటపాటు ధర్నా చేసినట్లు కార్మికులు తెలిపారు.