డీజిల్ కోసం బకీట్లతో ఊరంత కదిలింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు. బకెట్లు ,క్యాన్లతో లారీ వద్దకు క్యూ కట్టారు.  జిల్లాలోని దమ్మపేటమండలం ముష్టిబండ గ్రామం వద్ద అశ్వారావుపేట - ఖమ్మం జాతీయ రహదారిపై ఖమ్మం వైపు  నుంచి వస్తున్న ఓ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ కు గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్ నుంచి డీజిల్ కారుతుండడంతో స్థానికులు డీజిల్ కోసం ఎగబడ్డారు. దొరికిందే అదునుగా.. బకెట్లు, క్యాన్లలో డీజిల్ని తీసుకెళ్లారు.