కేసు భయంతో కట్టిన పుస్తెను తీసేసిన పెళ్లి కొడుకు

  • బాలికను పెండ్లి చేసుకున్న దివ్యాంగుడు 
  • పెండ్లి కొడుకుపై కేసు నమోదు చేసిన పోలీసులు

యాదాద్రి, వెలుగు: కేసు భయంతో బాలిక మెడ లో కట్టిన పుస్తెను పెండ్లి కొడుకు తొలగించిన ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో జరిగింది. మేడ్చల్​జిల్లా ఘట్​కేసర్​మండలం ఎదులాబాద్​కు చెందిన బాలిక(15)కు జనగామ జిల్లా కడివెండికి చెందిన దివ్యాంగుడు(30)కి బుధవారం పెండ్లి నిశ్చయమైంది. వీరి పెండ్లి జరుగుతుందనే సమాచారం అందడంతో వేములకొండకు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వలిగొండ పోలీసులు వెళ్లారు.

 అప్పటికే పెండ్లి అయిపోయింది. ఇరుకుటుంబాలను  స్టేషన్ కు రమ్మని అధికారులు చెప్పివెళ్లారు. కేసు అయితదనే భయంతో బాలికకు కట్టిన పుస్తెను పెండ్లి కొడుకు తొలగించాడు. అయినా.. అతడిపై బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006 కింద కేసు నమోదు చేశారు. బాలికను,త ల్లిదండ్రులను భువనగిరిలోని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచారు. ఆర్థిక, అనారోగ్యాల కారణాలతో పెండ్లికి ఒప్పుకున్నామని బాలిక తల్లి తెలిపింది. అనంతరం బాలికను సఖి సెంటర్​కు పంపించారు.