యాక్సిడెంట్లో మహిళా డాక్టర్ బ్రెయిన్ డెడ్.. నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపేసింది..

యాక్సిడెంట్లో మహిళా డాక్టర్ బ్రెయిన్ డెడ్.. నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపేసింది..

ఒక వైద్యురాలిగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కాపాడి.. చివరికి చనిపోయే ముందు కూడా నలుగురి జీవితాల్లో వెలుగు నింపి ఆదర్శంగా నిలిచింది భూమిక అనే డాక్టర్. ఇటీవల (ఫిబ్రవరి 2) నార్సింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వైద్యురాలు భూమిక చికిత్స పొందుతూ మృతి చెందారు. అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు ఆమె తల్లి దండ్రులు. దీంతో చినిపోతూ నాలుగు కుటుంబాల్లో వెలుగు నింపింది. 

హైదరాబాద్ కామినేని ఆసుపత్రి లో హౌజ్ సర్జన్ గా పని చేస్తున్న ఎల్బీనగర్ కు చెందిన భూమిక.. తన స్నేహితుడు యశ్వంత్ తో కలిసి ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో యశ్వంత్ స్పాడ్ డెడ్ కాగా.. భూమిక తీవ్ర గాయాల పాలైంది. దీంతో ఆమెను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడి బ్రెయిన్ డెడ్ అయింది. 

భూమిక కుటుంబ సభ్యులు జీవదానానికి ముందుకు వచ్చారు. భూమిక అవయవాలను సేకరించి అవసరమైన నలుగురికి ప్రాణం పోశారు. గుండె, కాలేయం (లివర్), కళ్లు, కడ్నీస్ దానం చేశారు తల్లిదండ్రులు.  తమ కూతురు అవయవ దానం చేసి నాలుగు కుటుంబాలను నిలబెట్టి గ్రేట్ అనిపించుకుందని, కానీ తమ కూతురు తమకిక లేదంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 

అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన భూమిక మృతదేహానికి  ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా భూమిక మృతదేహానికి గౌరవ వందనం సమర్పించారు. నలుగురికి ప్రాణాలు పొసిన భూమిక.. అమర్ హై.. అంటూ నినాదాలు చేసి కన్నీరు పెట్టుకున్నారు.