-
కస్టమర్లకు డ్రగ్స్ సేల్ చేసే ప్లాన్
-
ఎమ్‌డీఎమ్‌ఏ, కెటామైన్‌తో చిక్కిన డాక్టర్
హైదరాబాద్/ ఖైరతాబాద్, వెలుగు: ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లయర్‌గా మారిన డాక్టర్‌ను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌న్యూ) శుక్రవారం అరెస్ట్ చేసింది. రూ.12 లక్షలు విలువ చేసే 53 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ, 850 గ్రాముల కెటామైన్ స్వాధీనం చేసుకుంది. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన మహ్మద్ షబీర్ అలీ అలియాస్ సుదీప్ బిశ్వాస్ 2007లో కలకత్తా యూనివర్సిటీలో ఆయుర్వేదం కోర్సు చదివాడు. 2009లో సిటీకి వచ్చి గౌలిగూడలోని ఓ డెంటిస్ట్ వద్ద మూడు నెలలు పనిచేశాడు. ఆ తర్వాత చాంద్రాయణగుట్టలో క్లినిక్ ప్రారంభించాడు.
క్లినిక్‌కు వచ్చే కస్టమర్లకు డ్రగ్స్ అమ్మేందుకు ప్లాన్ చేశాడు. తక్కువ ధరకు లభించే కెటామైన్, ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్స్ కోసం ‘ఇండియా మార్ట్’ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి చెన్నైకి చెందిన డ్రగ్ సప్లయర్ శివతో పరిచయం చేసుకున్నాడు. రూ.30 వేలతో 53 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్ కొన్నాడు. దీన్ని కొరియర్ ద్వారా తెప్పించుకున్నాడు. ఒడిశాలోని మల్కన్‌గిరి వెళ్లి 850 గ్రాముల కెటామైన్ డ్రగ్స్ తీసుకొచ్చాడు. కస్టమర్లకు సేల్ చేసేందుకు ప్రయత్నించాడు. హెచ్‌న్యూ పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టి షబీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అమీర్‌పేట్‌లో కిలో అల్ఫోజోలం పట్టివేత
అల్ఫోజోలం తరలిస్తున్న నలుగురిని హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన యోగేశ్, మహేశ్వర్ ఇద్దరూ.. తమిళనాడులోని వేలూరుకు చెందిన డ్రగ్స్ సప్లయర్స్ ముత్తుకుమార్(32), సౌందరరాజన్(45)తో పరిచయం పెంచుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ కొని నిజామాబాద్‌లో సప్లయ్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందుకోసం నిజామాబాద్‌కు చెందిన భరత్, చిన్న గంగాధర్‌ను సప్లయర్లుగా నియమించుకున్నారు. ముత్తుకుమార్, సౌందరరాజన్ రూ.10 లక్షల విలువైన కిలో అల్ఫోజోలం తీసుకుని హైదరాబాద్ వచ్చారు. గురువారం రాత్రి అమీర్‌పేటలో భరత్, చిన్న గంగాధర్‌కు దాన్ని ఇస్తుండగా.. హెచ్‌న్యూ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అల్ఫోజోలంతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యోగేశ్, మహేశ్వర్ పరారీలో ఉన్నారు.
1700 గ్రాముల గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్
ఎల్బీనగర్: ఆదిబట్ల పీఎస్ పరిధిలోని కుర్మల్ గూడ సమీపంలో గంజాయి అమ్మేందుకు యత్నిస్తున్న చరణ్, నరేశ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1700 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు.చరణ్, నరేశ్ వైజాగ్‌లోని పాడేరు అటవీ ప్రాంతం నుంచి గంజాయిని సిటీకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు.