కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంటే..మరోవైపు హిందీలో బ్లాక్ బస్టర్ రియాలీటి షోస్ లో ఒకటైన.. బిగ్ బాస్ సీజన్ 18 (Bigg Boss 18) అక్టోబర్ 6, 2024న గ్రాండ్ గా కలర్స్ టీవీలో షురూ అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18 కోసం ప్రేక్షకుల నిరీక్షణ దాదాపు ముగిసింది. లేటెస్ట్ గా బిగ్ బాస్ 18 లో పాల్గొనే కంటెస్టెంట్లను సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో మొత్తం 19 మందిని హౌస్ లోకి ఆహ్వానించారు.
బిగ్ బాస్ 18 కంటెస్టెంట్స్ లిస్ట్:
వివియన్ డీ సేన
ఈషా సింగ్
నైరా బెనర్జీ
షెహ్‌జాదా ధామి
అవినాష్ మిశ్రా
అలైస్ కౌశిక్
ముస్కాన్ బామ్నే
కరణ్ వీర్ మెహ్రా
చాహత్ పాండే
శిల్పా శిరోద్కర్
చమ్ దారంగ్,
అర్ఫీన్ ఖాన్
సారా అఫ్రీన్ ఖాన్
హేమా శర్మ
శతికా అర్జున్
తాజిందర్ బగ్గా
రజత్ దలాల్
గుణరత్న సదావర్తే
గద్ రాజ్ (గాడిద)ను కంటెస్టెంట్లుగా ఆహ్వానించారు.
Also Read : దసరా ఫెస్టివల్ స్పెషల్.. ఓటీటీలోకి సుహాస్ మూవీ
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో ఒక ప్రత్యేకమైన ట్విస్ట్ ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో 'గధ్రాజ్' అనే గాడిదను ఆహ్వానిస్తూ.. నీవు ఈ షోలోకి రావాలని పిలిచినప్పుడు.. నర్వెస్ అయ్యావా? అని అంటే.. గట్టిగా ఆరించింది. దాంతో నర్వెస్ కాలేదా.. అయితే ఒకే.. ఈ ఇంటిలో నీవు మంచి కంటెస్టెంట్‌గా ఉండాలి. బాగా టాస్కులు ఆడాలి అని సల్మాన్ సూచించాడు. ఎవరైనా నిన్ను ఏదైనా అంటే ఏడ్వ కూడదు అని బుజ్జగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ గాడిదను కంటెస్టెంట్‌గా పంపి బిగ్ బాస్ ఎలాంటి ఆటను ఆడిస్తాడో వేచి చూడాల్సిందే అంటున్నారు నెటిజన్స్.
కాగా ఈ ప్రోమోలో కనిపించే ఈ గాడిద పేరు 'మ్యాక్స్'. కంటెస్టెంట్ అడ్వకేట్ గుణరత్న సదావర్తే పెంపుడు జంతువు అని సమాచారం.ఇది బిగ్ బాస్18 హౌస్‌లో పోటీదారులతో కలిసి ఉంటుంది.
Bigg Boss shuru hone se pehle hi aa gaya ek twist. Kya yeh donkey bhi hai in the participant list? 🫏 🤔
— JioCinema (@JioCinema) October 4, 2024
Watch #BiggBoss18 Grand Premiere 6 October raat 9 baje on @ColorsTV and #JioCinema#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss18 #BiggBoss @BeingSalmanKhan pic.twitter.com/lRvR2ljXjT
అయితే..బిగ్ బాస్ మేకర్స్ ఈ పేద గాడిదను ఒక్క చిన్న ప్రదేశానికి ఎందుకు పరిమితం చేసారు? అలా అరిచేందుకు తన కోసం ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. మేకర్స్ దయచేసి దాన్ని బయటకు రప్పించండి. ఇది జంతు హింస. ఒక జంతువు, ఆసరా కాదు. మరీ టూ మచ్ కదా అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.