గన్నేరువరం, వెలుగు : రాజీవ్‌రహదారి నుంచి పొత్తూరు వరకు నిర్మించనున్న డబుల్‌రోడ్డు పనులకు ప్లానింగ్కమిషన్వైస్చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్మాట్లాడుతూ వేములవాడ వెళ్లేందుకు దక్షిణ తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు ఇదే మెయిన్‌రోడ్డుగా మారుతుందన్నారు. గ్రామాల్లో ప్రధాన జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు.
ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ ప్రతిపక్షాలు రోడ్లను అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టుకోవాలని చూశాయని ఆరోపించారు. రోడ్డు నిర్మాణం చేపట్టడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ జీవీఆర్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, లీడర్లు మన్మోహన్ రావు, వెంకన్న, ఆంజనేయులు, లక్ష్మణ్, సుధాకర్ పాల్గొన్నారు