రైతు పంట పొలంలో డ్రోన్ కలకలం.. 

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ఓ రైతు పంటపోలంలో డ్రోన్ కలకలం రేపింది. విమానం తరహాలో ఐదు అడుగుల ఉన్న డ్రోన్ ను గొర్రెల కాపరులు గుర్తించారు. ఇదే విషయాన్ని వెంటనే శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డ్రోన్ ను పరిశీలించారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్దారించుకున్న తర్వాత డ్రోన్ ను పోలీస్ స్టేషన్  తరలించారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.