కరీంనగర్ జిల్లాలో ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు. కొత్తపల్లి మండలం చింతకుంట దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు దగ్గర వీరంగం సృష్టించాడు. మద్యంమత్తులో బస్సు కిందకు దూరి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. కాసేపు అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించాడు.
అసలేం జరిగిందంటే..కరీంనగర్ నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు చింతకుంట స్టేజి దగ్గర ప్రయాణికులు ఎక్కేందుకు ఆగారు. ఇంతలో మద్యం తాగిన వ్యక్తి బస్సు ఎక్కాడు. తాగిన వ్యక్తి వల్ల బస్సులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండడంతో అతన్ని కిందకు దించారు కండక్టర్, డ్రైవర్. దీంతో బస్సు కిందికి వెళ్లి టైర్ల కింద పడుకున్నాడు తాగుబోతు. ప్రయాణికులంతా దిగి కిందికెళ్లి తాగుబోతుని బయటికి తీసేందుకు ప్రయత్నించగా, తనను బస్సులో తీసుకు వెళ్ళాలని కాసేపు హడావుడి చేశాడు. చివరికి పోలీసులకు ఫోన్ చేస్తామని చెప్పడంతో బస్సు కింది నుంచి యటకు వెళ్లి వెళ్లిపోయాడు.