
కొందరు తాగిన మైకంలో ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. ఫుల్ గా తాగడం,ఎక్కడపడితే అక్కడ రోడ్లపై పడుకోవడం హైదరాబాద్లో రోజూ ఇలాంటి ఘటనలో చాలా కనిపిస్తాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగింది. ఫుల్ గా తాగిన ఓ ప్రభుద్దుడు మైకంలో ఫ్లై ఓవర్ పై నుంచి దూకాడు.
ఏప్రిల్ 21న ఓ వ్యక్తి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై నుంచి దూకాడు. పిల్లర్ నంబర్ 100 పై నుంచి కింద తాగిన మత్తులో కిందికి దూకాడు. మధ్యలో వైరును పట్టుకోవడంతో కాసేపు అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన స్థానికులు కారులో నుంచి కవర్ను తీసుకొని తెరిచి పట్టుకున్నారు. ఆ వ్యక్తి పై నుంచి కింద కవర్ తో క్షేమంగా కాపాడారు. ఈ ఘటనతో కాసేపు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.