మద్యం సేవించిన ఓ వ్యక్తి.. రైలు పట్టాలపై పడుకోవడంతో అతడిపై నుంచి ట్రైన్ వెళ్లడంతో ఒక కాలు, చెయ్యి తెగిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో నివాసం ఉంటున్న సిరిమల్ల సంపత్ అనే వ్యక్తి.. మండలంలోని గోపాల్ రావు పేట గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పైన మద్యం తాగి పడుకున్నాడు.
ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 23న) ఉదయం 10 గంటల ప్రాంతంలో ట్రైన్ సంపత్ పై నుంచి వెళ్లింది. దీంతో సంపత్ కుడి చెయ్యి, కాలు తెగిపోయాయి. స్థానికులు వెంటనే 108కు కాల్ చేశారు. చికిత్స కోసం అంబులెన్స్ లో జగిత్యాల హాస్పిటల్ కు తరలించారు. సంపత్ స్వగ్రామం కరీంనగర్. కొద్ది రోజుల నుంచి పూడూరులో నివాసం ఉంటున్నాడు.