జగిత్యాలలో ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై హల్ చల్ చేశాడు. జగిత్యాలలో ట్రాఫిక్ పోలీసులు రాత్రి వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి మద్యం మత్తులో అక్కడకు వచ్చాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో టెస్టు చేశారు. దీంతో 160 వరకు రీడింగ్ రావడంతో పోలీసులు సదరు వ్యక్తి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో కోపంతో ఊగిపోయాడు.
ట్రాఫిక్ పోలీసులతో కాసేపు వాగ్వివాదానికి దిగాడు. వెంటనే అతడ్ని జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యం తాగిన తర్వాత వాహనాలు నడిపించవద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదంటున్నారు ప్రజలు.