పెంపుడు కుక్కకు ఘనంగా అంతిమ వీడ్కోలు

పెంపుడు కుక్కకు ఘనంగా అంతిమ వీడ్కోలు

పెంపుడు జంతువులతో మనుషులకు ఉండే అటాచ్మెంట్ వెలకట్టలేనిది. వాటిని కూడా సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తారు కొందరు. ఓ పెంపుడు కుక్క చనిపోగా..దానికి ఘనంగా అంతిమ వీడ్కోలు నిర్వహించారు యజమాని. ఈ ఘటన ఒడిశాలోని పర్లాకిమిడిలో జరిగింది. 

పర్లాకిమిడికి చెందిన టన్ను గౌడ పెంపుడు కుక్క మరణించింది. 17ఏళ్ల పాటు తమతో ఉన్న కుక్క మరణించడంతో ఆ కుటంబం బోరున విలపించింది. తమ ఇంట్లో కుటుంబసభ్యుడు చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో..దానికి కూడా అలాగే చేశారు. పూలతో డెకరేట్ చేసిన వాహనంలో బ్యాండ్ బాజా మధ్య దాన్ని అంతిమయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత శ్మశాన వాటికలో కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.