ఆషాడం తర్వాత ఫస్ట్ టైం అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడుకి మర్యాదలతో ముంచెతింది ఓ కుటుంబం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఓ కుటుంబం అల్లుడి 100 రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేసింది. దీంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లుడూ, కూతుర్ని కూర్చోబెట్టి చూట్టూ 100 రకాల వంటకాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలో నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
కొన్ని మూవీ సీన్లతో పోల్చుతూ.. ఫన్నీ కామెంట్లతో నెటీజన్లు రియాక్ట్ అవుతున్నారు. కాకినాడకు చెందిన రత్న కుమారి 2023 సెప్టెంబర్‌లో రవితేజతో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత మొదటి ఆషాడ మాసం ముగించుకొని అత్తగారింటికి వచ్చిన రవితేజకు ఈ రకంగా మర్యాదలు చేశారు.
#AndhraPradesh---#Andhra family treats son-in-law with a feast of 100 food items
— NewsMeter (@NewsMeter_In) August 11, 2024
A family in Tamarada village in #Kirlampudi mandal of #Kakinada district, prepared a huge feast for their son-in-law.
The feast had a whopping 100 different kinds of food.
Ratna Kumari, a… pic.twitter.com/yVuNN8CnRB