దులీప్ ట్రోఫీలో భాగంగా ఒక అరుదైన సంఘటన జరిగింది. ఇండియా సి జట్టు కెప్టెన్.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ పాదాలను తాకేందుకు ఒక అభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. గైక్వాడ్ పాదాలు మొక్కి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఎవరికీ హానీ చేయలేదు. తమ ఫేవరేట్ ఆటగాళ్లను కలుసుకోవడానికి గ్రౌండ్ లోకి రావడం కామన్. అయితే ఈ సంఘటన అనంతపురంలోని భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ప్రస్తుతం అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలోని దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దులీప్ ట్రోఫీలో ఇండియా సి వర్సెస్ డి మ్యాచ్ గురువారం (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు సరైన భధ్రత కనిపించట్లేదనే వార్తలు వస్తున్నాయి. గైక్వాడ్ ను కలుసుకోవడానికి అభిమాని చాలా స్వేచ్ఛగా లోపలి వచ్చినట్టు సమాచారం. అయితే ఏదైన ప్రమాదం జరిగితే ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. తొలిసారి అనంత పురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు జరగడం విశేషం.
ALSO READ | స్వైటెక్‌కు షాక్..సెమీస్‌లో పెగులా, సినర్, డ్రాపర్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండు జట్లు నువ్వా, నేనా అన్నట్టు ఆడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా–డి బ్యాటింగ్‌లో ఫెయిలైంది. అక్షర్ పటేల్ (86) ఒంటరి పోరాటం చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 164 రన్స్‌కే కుప్పకూలింది. విజయ్‌కుమార్ (3/19), అన్షుల్ కాంబోజ్ (2/47), హిమాన్షు చౌహాన్ (2/22) దెబ్బకు ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా–సి 168 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. హర్షిత్ రానా 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా- డి ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
A fan invaded the pitch to touch Ruturaj Gaikwad's feet during the Duleep Trophy match between India C and India D 🙌
— OneCricket (@OneCricketApp) September 6, 2024
📸: Jio Cinema#DuleepTrophy2024 #RuturajGaikwad pic.twitter.com/JrrzlyxWPA