ఇది కదా అభిమానం అంటే.. పల్లవి ప్రశాంత్కు ఖరీదైన గిఫ్ట్

ఇది కదా అభిమానం అంటే.. పల్లవి ప్రశాంత్కు ఖరీదైన గిఫ్ట్

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ చరిత్రను తిరగరాశాడు. కామన్ మ్యాన్ గా ఇంట్లోకి అడుగుపెట్టి తన అసాధారణమైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేమాభిమానాలతో పాటు బిగ్ బాస్ టైటిల్ ను సైతం కైవసం చేసుకున్నాడు. దీంతో అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అందులో ఒక అభిమాని మాత్రం పల్లవి ప్రశాంత్ కు మరిచిపోలేని ఖరీదైన బహుమానాన్ని అందించాడు. 

యాదగిరి గుట్టకు సమీపంలో ఉన్న వంగపల్లి దగ్గర రూ.15 లక్షలు విలువ చేసే ఓపెన్‌ ప్లాట్‌ను బహుమతిగా అందిస్తున్నట్లు ప్రకటించారు. రైతు బిడ్డగా వచ్చి సెలబ్రెటీలకు ఏమాత్రం తగ్గకుండా ఆట ఆడి గెలవడం అనేది తనకు చాలా నచ్చిందని మీడియా ముఖంగా అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.