బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi prashanth) విజేతగా నిలిచారు. సీరియల్ యాక్టర్ అమర్ దీప్ రన్నరప్ గా నిలిచారు. నిజానికి గత సీజన్లలో ఎప్పుడు లేని విధంగా సీజన్ 7 విన్నర్ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమర్ దీప్ కూడా విన్నర్ అవుతారని చాలా మంది అనుకున్నారు కానీ.. కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో జరగనిది ఒకటి ఈ సీజన్ లో జరిగింది. అదేంటంటే.. బిగ్ బాస్ లో తన ఫెవరేట్ కంటెస్టెంట్ పై ఒక అభిమాని ఏకంగా పుస్తకమే రాశాడు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్. అవును అమర్ దీప్ ఫ్యాన్ ఒకరు అయనపై ఏకంగా పుస్తకమే రాశారు. ఇటీవల న్యూ ఇయర్ కోసం జరిగిన ఒక ఈవెంట్ లో అమర్ దీప్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లోనే అతని ఫ్యాన్ ఆ పుస్తకాన్ని అమర్ దీప్ కు ఆడించాడు. అంతేకాదు.. బిగ్ బాస్ లో నువ్వు రన్నర్ అయుండొచ్చు కానీ మాకు మాత్రం నివ్వే విన్నర్ అన్నా.. అని చెప్పుకొచ్చాడు. దాంతో అమర్ దీప్ ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక అమర్ దీప్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సీరియల్స్ తోపాటు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ స్టేజిపై మాస్ రాజా రవితేజ చెప్పినట్టుగా ఆయన సినిమాలో అమర్ దీప్ కు ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. రవితేజ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. మరి ఈ సినిమాలో అమర్ దీప్ అవకాశం దక్కించుకుంటాడా అనేది చూడాలి.