
నెత్తిన జుట్టు ఉండటం కామన్.. అదే జుట్టును మోడ్రన్ కట్ చేయించుకోవటం కామన్.. ఈ కుర్రోడు మాత్రం టూ మచ్ టాలెంట్ చూపించాడు. తన నెత్తిని.. నెత్తిపై జుట్టుతో పార్టీ అభిమానం చాటుకున్నాడు. నెత్తికి ఓ వైపు కేసీఆర్ అని.. మరో వైపు కేటీఆర్ అని.. వెనక వైపు బీఆర్ఎస్ అంటూ వీరాభిమానం చూపించాడు. అంతేనా.. జుట్టుకు గులాబీ రంగు వేసుకుని.. పార్టీ రంగుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ చిత్రం చూసినోళ్లు అందరూ.. ఇంత టాలెండెట్ కుర్రోడు ఎవడ్రా బాబూ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్టిక్కెట్టును డా.మెతుకు ఆనంద్ కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తన అభిమాన నాయకుడికి టికెట్టు కేటాయించడం పట్ల వికారాబాద్పట్టణానికి చెందిన నరేష్ అనే యువకుడు హర్షం వ్యక్తం చేశాడు.
టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్ఠానంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటాలని నిర్ణయించుకుని ఇలా ఓ వైపు కేసీఆర్,మరో వైపు కేటీఆర్, మధ్యలో బీఆర్ఎస్పేరు వచ్చేలా కటింగ్ చేయించుకున్నాడు.
పింక్కలర్ చొక్కా తొడగడం ఒకెత్తైతే, జుట్టు మొత్తానికి పింక్ కలర్వేయించుకోవడం మరో ఎత్తు. ఇదే ఆహార్యంతో అతను ఆగస్టు 23 న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. లీడర్లు అతనితో పోటీపడి సెల్ఫీలు దిగారు.