
లాక్ డౌన్, కరోనా విపత్కర సమయంలో అడిగిన వారికల్లా సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ కు ఖమ్మం జిల్లా వాసి విగ్రహం ఏర్పాటు చేశాడు.బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత గ్రామంలో సోనుసూద్ విగ్రహం ఏర్పాటు చేశాడు. తనకు ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా తన సొంత డబ్బులతో విజయవాడలోని గొల్లపూడిలో సోనూసూద్ విగ్రహాన్ని తయారు చేయించాడు. అక్కడి నుంచి ఆటోలో విగ్రహాన్ని గార్లపాడు గ్రామానికి తీసుకొచ్చాడు. వెంకటేశ్ చేసిన పనికి గ్రామస్తులంతా అతనిని అభినందిస్తున్నారు. విగ్రహం ప్రారంభోత్సవానికి సోను సూద్ ను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని వెంకట్ అన్నారు. ఈ నెల 13 లేదా 14 న విగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు వెంకటేశ్.