- కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో విషాదం
బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం ఓ రైతు మంటల్లో సజీవ దహనమయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం..బీర్కూర్మండల కేంద్రానికి అరిగె చిన్న రాములు(64) తన పొలంలోని వరి కొయ్యలకు సోమవారం నిప్పు పెట్టాడు. దీంతో భారీగా పొగ రావడంతో అది పీల్చి స్పృహ తప్పి పడిపోయాడు. పొలమంతా మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. ఉదయం వెళ్లిన రాములు ఇంకా రాలేదని, అతడి కొడుకు పొలానికి వెళ్లి చూడగా పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.