చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం

వరంగల్  జిల్లా  చెన్నారావుపేట  మండలం పాపయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. అల్లంనేని పాపారావు అనే రైతు తన వ్యవసాయపొలంలో సజీవదహానం అయ్యాడు. భూమిని చదును చేసేందుకు మొక్కజొన్న చొప్పకు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చుట్టు మంటలు చెలరేగి పాపారావు మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం పెద్దదిక్కును కోల్పోడంతో పాపయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.