- మెదక్ జిల్లా పొడ్చన్ పల్లిలో విషాదం
పాపన్నపేట,వెలుగు: ప్రమాదవశాత్తూ నదిలో మునిగి రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు..పాపనపేట మండలం పొడ్చన్ పల్లికి చెందిన రైతు బుట్ట జీవయ్య(63) గురువారం గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డున తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేయగా పని చేయలేదు. దీంతో నదిలోకి దిగి ప్రమాదవశాత్తూ అతడు నీట మునిగి ఊపిరాడక చనిపోయాడు. సమీప పొలాల రైతులు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకొని డెడ్ బాడీని బయటకు తీశారు. పోలీసులు వెళ్లి పరిశీలించి డెడ్ బాడీ పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కిష్టమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.