గూడూరు, వెలుగు : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్ తో చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బల్లపల్లి శివారు బొడ్డెరగూడెంనకు చెందిన సంపంగి ఐలయ్య (54)బుధవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
సాయంత్రమైనా ఐలయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. పొలం చుట్టూ వెతుకుతుండగా బావి వద్ద చనిపోయి కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి చెప్పారు.