సూర్యాపేట జిల్లాలో ఓ రైతు ఉపాయం

సూర్యాపేట వెలుగు : గ్రామాల్లో, పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. ఇవి చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. దీంతో వీటి భారి నుంచి తప్పించుకోవడానికి, తరిమికొట్టడానికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ రైతు తన పత్తి చేనును కాపాడుకోవడానికి కొత్త ఐడియా వేశాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు భూపాల్ రెడ్డి 10 ఎకరాల్లో పత్తి వేశాడు. పూత దశ నుంచి కాత దశకు వచ్చే సరికి కోతులు పడి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఓ ఫ్రెండ్​ సలహాతో యూట్యూబ్ లో చూసి గొరిల్లా బట్టలు తెప్పించాడు. కోతులు వచ్చినప్పుడు వాటిని వేసుకొని బెదిరిస్తూ పారిపోయేలా చేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు కొండముచ్చులను తీసుకువచ్చినా ప్రయోజనం కనిపించలేదని, ఈ కొత్త ప్లాన్​వర్కవుట్​అయ్యిందని తెగ సంబురపడిపోతున్నాడు. ఈ బట్టలను ఆన్​లైన్​లో రూ.4500 కు కొన్నానని, మిగతా రైతులు కూడా గొరిల్లా బట్టలు తెప్పించుకుంటున్నారని చెబుతున్నాడు.