మీకు తెలుసా: రైతులు ఏ రాష్ట్రంలో నెలకు ఎంత సంపాదిస్తున్నారంటే..!

మీకు తెలుసా: రైతులు ఏ రాష్ట్రంలో నెలకు ఎంత సంపాదిస్తున్నారంటే..!

భారతదేశంలో మూలాధారం అయిన వ్యవసాయానికి పట్టుకొమ్మలు రైతులు.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే రైతులు లక్షల మంది.. చాలీచాలని సంపాదన.. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక.. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయి అప్పులపాలు అయ్యే రైతులు ఇంకెందరో.. మరికొంతమంది లక్షలజీతాలొచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వదిలేసి.. సాగుబాట పట్టి కొత్త ఆలోచనలతో కోట్లు సంపాధిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా పంటలకు గిట్టుబాటు ధర కావాలంటే ఆంధోళనలు చేస్తున్న సమయంలో.. అసలు భారతదేశంలో రైతుల నెల సంపాదన ఎంత అనే ఆసక్తి అందరిలో నెలకొంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల క్యాబినేట్ మీటింగ్ లో 14 రకాల పంటలకు కనీస మద్ధతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ప్రభుత్వం రిలీజ్ చేసిన సర్వే ప్రకారం.. ఏ రాష్ట్రంలోని రైతు నెలకు సరాసరిన ఎంత సంపాదిస్తున్నారు అనేది చూద్దాం.. 

>>> పంజాబ్ లో రైతుల నెల సంపాదన 26 వేల 701 రూపాయలుగా ఉంది. 

>>> హర్యానా రైతుల నెలావారీ సంపాదన యావరేజ్ గా 22 వేల 841 రూపాయలుగా ఉంది.

>>> మేఘాలయలో ఓ రైతు నెల సంపాదన యావరేజ్ గా 29 వేల 348 రూపాయలుగా ఉంది. దేశంలో ఇదే హయ్యస్ట్.

>>> ఇక తెలంగాణలో ఓ రైతులు నెలకు యావరేజ్ గా 9 వేల 403 రూపాయలు సంపాదిస్తున్నారు..

>>> ఇక ఆంధ్రప్రదేశ్ లోని రైతులు నెలకు 10 వేల 480 రూపాయలు సంపాదిస్తున్నారు.

>>> ఒడిశా రైతులు 5 వేల 112 రూపాయలు.. పశ్చిమ బెంగాల్ రైతులు నెలకు 6 వేల 762 రూపాయలు సంపాదిస్తున్నారు.

>>> అరుణాచల్ ప్రదేశ్ రైతులు నెలకు 19 వేల 225 రూపాయలు, నాగాలాండ్ రైతులు 9 వేల 877 రూపాయలు సంపాదిస్తున్నారు.

>>> మణిపూర్ రైతులు సంపాదన నెలకు రూ.11 వేల 227 రూపాయలుగా ఉండగా.. మిజోరం రైతుల సంపాదన 17 వేల 964 రూపాయలుగా ఉంది.

>>> త్రిపుర రైతుల నెల సంపాదన 9 వేల 918 రూపాయలుగా ఉండగా.. అసోం రైతులు 10 వేల 675 రూపాయలు సంపాదిస్తున్నారు. సిక్కిం రైతులు 12 వేల 447 రూపాయలు సంపాదిస్తున్నారు.
>>> తమిళనాడు రైతుల యావరేజ్ నెల సంపాదన 11 వేల 924 రూపాయలుగా ఉండగా.. కేరళ రైతుల సంపాదన 17 వేల 915 రూపాయలుగా ఉంది. 

>>>కర్ణాటక: రైతుల నెలవారీ సంపాదన 13 వేల 441 రూపాయలుగా ఉండగా.. మహారాష్ట్ర రైతుల సంపాదన 11 వేల 492 రూపాయలుగా ఉంది.

>>> గుజరాత్ రైతుల నెలవారీ యావరేజ్ ఆదాయం 12 వేల 631 రూపాయలుగా ఉంటే.. మధ్యప్రదేశ్ రైతుల ఆదాయం 8 వేల 339 రూపాయలుగా ఉంది.

>>> ఉత్తరప్రదేశ్ రైతుల నెలవారీ యావరేజ్ ఆదాయం 8 వేల 61 రూపాయలుగా ఉంటే.. రాజస్థాన్ రైతుల సంపాదన 12 వేల 520 రూపాయలుగా ఉంది. 

>>> ఇక జమ్మూకాశ్మీర్ రైతుల నెలవారీ ఆదాయం 18 వేల 918 రూపాయలుగా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్ రైతుల ఆదాయం 12 వేల 153 రూపాయలుగా ఉంది. ఉత్తరాఖండ్ రైతుల ఆదాయం 13 వేల 562 రూపాయలుగా ఉంది.

>>> బీహార్ రైతుల నెలవారీ యావరేజ్ ఆదాయం 7 వేల 542 రూపాయలు అయితే.. జార్ఖండ్ రైతుల సంపాదన 4 వేల 895 రూపాయలుగా ఉంది.. చత్తీస్ ఘడ్ రైతుల ఆదాయం 9 వేల 677 రూపాయలుగా ఉంది. 

పైన చెప్పిన ఆదాయాలు అన్నీ 2021లో రిలీజ్ అయిన నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ రిలీజ్ చేసిన గణాంకాలు.