బ్యాంక్లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..బంధువుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.  బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగి ఓ  రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే.. ఆదిలాబాద్ టౌన్ లోని  ఐసిఐసిఐ బ్యాంక్ లో బేల మండలం రేణి గూడకు  చెందిన రైతు జాదవ్ దేవరావు రూ. 3.50 లక్షల  లోన్ తీసుకున్నాడు.  బ్యాంక్ సిబ్బంది ఫోన్లు చేసి వేధిస్తున్నారని జాదవ్ దేవ్ రావు ఆరోపించారు. ఇవాళ బ్యాంక్ కు వచ్చిన జాదవ్  దేవ్ రావు బ్యాంక్ లోపలే  పురుగుల మందు తాగాడు. హుటాహుటిన వెంటన్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా  జాదవ్ దేవ్ రావు మృతి చెందాడు. 

ALSO READ | కరెంటు సమస్యల వల్ల ఏ రైతూ ఇబ్బంది పడొద్దు.. ఒక్క ఎకరం కూడా ఎండొద్దు: డిప్యూటీ సీఎం భట్టీ

జాదవ్ దేవ్  రావు మృతితో అతని కుటుంబ సభ్యులు బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు.  తీసుకున్న అప్పు చెల్లించడం లేదని దేవరావును బ్యాంక్ అధికారులు పిలిచారని  కుటుంబ సభ్యులు అంటున్నారు.  అధికారులు వేధింపులకు పాల్పడడంతో  అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ  నిరసనకు దిగారు.   బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకుని.. రైతు కుటుంబానికి ఆదుకోవాలన్నారు.  కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.