పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఘటన 

కోనరావుపేట, వెలుగు : పోడు భూమికి అధికారులు పట్టా ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ రైతు నెల రోజుల్లో రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల కనకయ్య(51) 30ఏండ్లుగా శివంగళపల్లి గ్రామ శివారులోని 5 ఎకరాలు సాగు చేసుకుంటున్నాడు. ఫారెస్ట్ అధికారులు 6నెలల కింద కనకయ్య భూమిలో ప్లాంటేషన్ చేశారు. ఆ మొక్కల్ని తొలగించిన కనకయ్య ఆముదం సాగు చేశాడు. దీంతో ఫారెస్ట్ అధికారులు కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించడంతో నెల రోజుల కింద పురు గుల మందు తాగాడు.

మళ్లీ అధికారుల చుట్టూ తిరిగినా పట్టా ఇవ్వలేదు. అతని భూమిలో మళ్లీ ప్లాంటేషన్ చేయడంతో మనస్తాపం చెందిన కనకయ్య మంగళవారం అదే భూమిలో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్​కు తరలించారు.