కడప: అప్పుల బాధ తాళలేక ఓ రైతు కుటుంబ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సింహాద్రిపురంలో చోటు చేసుకుంది. పొలం దగ్గరే ఉరి వేసుకున్న రైతు కుటుంబాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహయంతో మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులను నాగేంద్ర, వాణి, గాయత్రి, భార్గవ్‌గా గుర్తించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు అప్పులేనా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకేసారి నలుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో సింహాద్రిపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.