
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ఒక బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో12 మంది చనిపోయారు. మరో 45 మందికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున జోహన్నెస్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
కాట్లెహాంగ్ నుంచి ప్రయాణికులను తీసుకొని వస్తుండగా బస్సు బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.