అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీ

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం (జులై 22న) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

లారీ డ్రైవర్‌ అతివేగమే ప్రమదానికి కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట- తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.