ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొన్న బొలెరో వాహనం..ఇద్దరు మృతి

జనగామ జిల్లా రఘునాథ్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమల్లలోని టోల్ గేట్ వద్ద హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. బొలేరో వాహనం ‌వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.