జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులోని ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి మెట్ పల్లి వెళ్తున్న ఒక కారు.. ఆటో ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో లారీతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంలో కోరుట్ల మండలం ధర్మారం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ లింగారెడ్డి (41) అక్కడికక్కడే చనిపోయాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.