
సంగారెడ్డి : పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్ చెరు నుంచి శంషాబాద్ వెళ్తున్న బియ్యం లోడుతో ఉన్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న గుడిసెల్లోకి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరు సర్వీస్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. చనిపోయిన వారిలో సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు నీళ్లు పోసే కార్మికులు బాబు రాథోడ్ ( 48 ) కమలీ భాయ్ (43) రాథోడ్ (23) ఉన్నారు.