ప్రాణాలు తీసిన అతివేగం.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

హైదరాబాద్ : శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబాగూడ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. KTM బైక్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై.. కృష్ణ, మహేష్ అనే ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా బైక్ నడడం వల్ల అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

బాధితులు మహబూబ్ నగర్ జిల్లా పాలెం గ్రామానికి చెందినవారు. విషయం తెలియగానే శామీర్ పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.